
- వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమలు
ముంబై: మహారాష్ట్రలో నూతన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ 2020)ని వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా మరాఠీ, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేసింది. థర్డ్ ల్యాంగ్వేజ్‌గా దీన్ని బోధించనున్నారు.
ఎన్ఈపీలోని కరిక్యులమ్‌ను దశలవారీగా అమలు చేస్తామని పేర్కొంది. తొలుత వచ్చే ఏడాది ఫస్ట్ క్లాస్‌లో దీన్ని ప్రవేశపెట్టి.. 2028–29 నాటికి అన్ని క్లాస్‌లకు విస్తరించనున్నారు. భాషా విధానంలో భాగంగా హిందీని థర్డ్ ల్యాంగ్వేజ్‌గా కంపల్సరీ చేశారు. ఎన్ఈపీ, హిందీ బోధన కోసం టీచర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.
‘‘ప్రస్తుతం ఉన్న 10+2+3 ఫార్మాట్ స్థానంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020ని అమలు చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా 5+3+3+4 ఫార్మాట్‌ను అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇది క్రమంగా అమలులోకి తెస్తాం” అని మహారాష్ట్ర స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సెక్రటరీ తుషార్ మహాజన్ పేర్కొన్నారు.