ట్రైనింగ్ కోసమని హైదరాబాద్ వచ్చారు.. శ్రీశైలం వెళ్తుండగా యాక్సిడెంట్.. డీసీపీ మృతి

ట్రైనింగ్ కోసమని హైదరాబాద్ వచ్చారు.. శ్రీశైలం వెళ్తుండగా యాక్సిడెంట్.. డీసీపీ మృతి

నల్లమల్లలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైనింగ్ కోసమని హైదరాబాద్ వచ్చిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్.. శ్రీశైలం వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లాలో  శ్రీశైలం వెళ్లే దారిలో ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో డీసీపీతో పాటు మరో మరో వ్యక్తి చనిపోయిన ఘటన తీవ్ర విషాదానికి గురిచేసింది. త్వరలో డీజీపీగా ప్రమోషన్ పొందే ముందు చనిపోవడం కుటుంబ సభ్యులను, డిపార్ట్ మెంట్ ను విషాదంలో ముంచేసింది. 

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ సుధాకర్ పథారే మిడ్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. శ్రీశైలం సందర్శించేందుకు బంధువుతో కలిసి ఇన్నోవాలో వెళ్తున్న క్రమంలో సడెన్ యాక్సిడెంట్ జరిగింది. నల్లమల్ల మార్గంలో దోమలపెంట సమీపంలో ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. ఆర్టీసీ బస్, ఇన్నోవా ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 

సుధాకర్ పథారే.. ముంబైలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వరుసకు సోదరుడైన భగవత్ కొడాకేతో కలిసి శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీశైలం దర్శనం కోసం వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే కల్వకుర్తి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు డాక్టర్లు. డీసీపీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అంతర్గతంగా రక్తస్రావం అయ్యింది, మరో వ్యక్తికి కాలు విరగడంతో పాటు బాడీలో పెద్ద గాయాలు కావడంతో ఇద్దరూ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోస్ట్ మార్టం జరుగుతుందని, ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఇద్దరూ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని చెప్పారు. 

డీసీపీ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మహారాష్ట్ర పోలీస్ శాఖ:

డీసీపీ మరణవార్త తమను తీవ్రంగా కలచివేసిందని ముంబై పోలీసులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సుధాకర్ పథారే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని.. ముంబై పోర్ట్ జోన్, నవీ ముంబై ప్రాంతాలలో ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని అన్నారు. డిపార్ట్ మెట్ తరఫున, సహ ఉద్యోగులుగా, స్నేహితులుగా ఆయన కుటుంబ సభ్యలకు సానుభూతి ప్రకటిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

Mumbai Police is deeply saddened to announce the untimely demise of Deputy Commissioner of Police (DCP) Sudhakar Pathare in a tragic road accident near Hyderabad today.
DCP Pathare was a dedicated officer who served the force with commitment and integrity. His contributions in… pic.twitter.com/OEkoE2sDCQ

— पोलीस आयुक्त, बृहन्मुंबई - CP Mumbai Police (@CPMumbaiPolice) March 29, 2025