24 గంటల్లో 18 మంది మృతి...ఛత్రపతి శివాజీ మహారాజ్ హాస్పిటల్​లో ఏం జరుగుతోంది

24 గంటల్లో 18 మంది మృతి...ఛత్రపతి శివాజీ మహారాజ్ హాస్పిటల్​లో  ఏం జరుగుతోంది
  • మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు
  • స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సీఎం ఏక్​నాథ్ షిండే


థానే: మహారాష్ట్ర థానే జిల్లా కల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ హాస్పిట్​లో గడిచిన 24 గంటల్లో 18 మంది చనిపోయారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. ఒక్కరోజులో ఇంతమంది ఎలా చనిపోయారనేది తెలియట్లేదని అధికారులు చెప్పారు. ఆస్పత్రిలో రోజుకు 6 నుంచి 8 మంది చనిపోతుంటారని తెలిపారు. అలాంటిది 24 గంటల్లో 18 మంది చనిపోవడం చర్చనీయాంశమైంది. చనిపోయిన వారిలో 12 మంది వయస్సు 50 ఏండ్ల పైబడి ఉందని డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటనపై సీఎం ఏక్​నాథ్ షిండే ఆరా తీశారు. దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్లే..

మృతి చెందిన రోగులు కిడ్నీలో రాళ్లు, దీర్ఘకాలిక పక్షవాతం, న్యుమోనియా, అల్సర్, కిరోసిన్ పాయిజనింగ్, సెస్టిసిమియా తదితర సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నారు. ట్రీట్​మెంట్ సందర్భంగా ఇచ్చిన మందులు, సెలైన్లు, హెల్త్ రికార్డులను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల స్టేట్​మెంట్లు కూడా రికార్డ్ చేస్తామన్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమవాళ్లు చనిపోయారంటూ చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. ఈ విషయం విచారణ కమిటీ నిర్ణయిస్తుందని వివరించారు. ఈ హాస్పిటల్​లో కోవిడ్ స్టాఫ్ కింద సేవలు అందిస్తున్న 500 మంది సిబ్బందిని జనరల్ వార్డులకు షిఫ్ట్ చేశారు. అడిషనల్ నర్సింగ్ స్టాఫ్​ను కూడా నియమించారు. పోస్టుమార్టం చేసి డెడ్​బాడీలను వారి కుటుంస సభ్యులకు అప్పగిస్తున్నారు. 

రిపోర్ట్​ను బట్టి చర్యలు: హెల్త్ మినిస్టర్ సావంత్ 

వరుస మరణాలపై హెల్త్​ మినిస్టర్ సావంత్ మీడియాతో మాట్లాడారు. పరిస్థితి గురించి హాస్పిటల్ డీన్​తో మాట్లాడినట్లు వివరించారు. రెండు రోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆదేశించానని వెల్లడించారు. కొందరు పేషంట్లను క్రిటికల్ స్టేజీలో తీసుకురావడంతో పరిస్థితి విషమించి చనిపోయినట్లు తెలుస్తున్నదన్నారు. మరికొందరు దీర్ఘ కాలిక వ్యాధులు, వయోభారంతో మరణించారని, ఏది ఏమైనా లోతుగా దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. 17 మృతుల్లో 13 మంది ఐసీయూలో ట్రీట్​మెంట్ తీసుకుంటూ చనిపోయారన్నారు. కొన్ని రోజుల కింద ఇదే హాస్పిటల్​లో ఐదుగురు చనిపోయారని వివరించారు. డీన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.