ఆ నరకం చెప్పలేం : అడవిలో చెట్టుకు గొలుసులతో అమెరికా మహిళ.. 40 రోజుల తర్వాత వెలుగులోకి..!

ఆ నరకం చెప్పలేం : అడవిలో చెట్టుకు గొలుసులతో అమెరికా మహిళ.. 40 రోజుల తర్వాత వెలుగులోకి..!

ఎంత దారుణం.. ఎంత కిరాతకం.. ఎంత నరకం.. మాటల్లో చెప్పలేని ఆవేదన.. మాటల్లో వివరించలేని విషాధం.. ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 40 రోజులు.. మనిషి కూడా కనిపించని చిట్టడవి.. పెద్ద చెట్టుకు గొలుసులతో మహిళలను బంధించాడు ఆ కిరాతకుడు.. 40 రోజులపాటు ఆ గొలుసుల బంధీతో ఆమె అనుభవించిన నరకంగా పగోళ్లకు కూడా రావొద్దు అనేంత విషాధం ఇది.. 2024, జూలై 29వ తేదీ మహారాష్ట్రలో వెలుగు చూసిన ఘటనతో దేశం మొత్తం షాక్ అయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

అమెరికాకు చెందిన 50 ఏళ్ల మహిళ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అటవీప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించిన ఘటన శనివారం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ ఎస్ అనే మహిళ తమిళనాడులో నివసిస్తుంది. ఇటీవల కుటుంబంలో వివాదాలు తలెత్తగా ఆమెను తీసుకుని అడవికి వెళ్లిన భర్త ఆ మహిళను అడవిలో బంధించాడు.

శనివారం సాయంత్రం ఆమె కేకలు విన్న సోనూర్లి గ్రామంలో గొర్రెల కాపరి  గొలుసుతో చెట్టుకు కాలు కట్టి ఉన్న మహిళను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఆమెను రక్షించిన తర్వాత పోలీసులు ప్రథమ చికిత్స చేసి సింధుదుర్గ్‌లోని సావంత్‌వాడి తాలూకాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆమెను మరింత మెరుగైన వైద్యం కోసం  సింధుదుర్గ్‌లోని ఓరోస్‌కు తరలించారు. 

కాగా ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు మహిళ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆమె తన ఆరోగ్య సమస్యలను కాగితంపై రాసి వారితో సంభాషించారని చెప్పారు. ఆమె 40 రోజులుగా ఆహారం లేకుండా అడవిలో గొలుసుతో కట్టేయబడి ఉందని తెలిపింది. గొడవ పడి తన భర్త తనను అడవిలో బంధించాడని లిఖితపూర్వకంగా పేర్కొంది. ఈ ఘటనపై మహారాష్ట్ర పోలీసు అధికారి మీడియాతో మాట్లాడారు. ఈ విషయానికి సంబంధించి ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని అయితే దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. మహిళ తన స్టేట్‌మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు.  40 రోజులుగా ఏమీ తినకపోవడంతో ఆ మహిళ బలహీనంగా ఉందని చెప్పారు. తనను కట్టేసిన ప్రదేశంలో భారీ వర్షాలు కురుస్తుంటాయని తెలిపారు.  త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.