మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొలివాడ అనే గ్రామంలో ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లు వినియోగించాలని ప్రజలంతా ఏకమై తీర్మానం చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు( EVM) లకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన రెండో గ్రామం కొలివాడ. మొదట మర్కద్వాడ అనే గ్రామంలో ప్రజలు EVM లను తిరస్కరించారు.
కరద్ (సౌత్) అసెంబ్లీ నియోజకవర్గంలోని కొలివాడ గ్రామంలో భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ పేపర్లే ముద్దు అంటూ.. ఏకనినాదంతో గ్రామస్తులంతా తీర్మానం చేశారు. ఈవీఎంలో అవకతవకలు జరుగుతున్నాయని వస్తున్న వార్తల క్రమంలో కొలివాడ గ్రామస్తుల తీర్మానం చర్చనీయాంశంగా మారింది. ఈ గ్రామం ఉన్న కరద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పృథ్విరాజ్ చౌహాన్ గెలిచారు. ఇక్కడనుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అతుల్ భోంస్లే 39వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం.
ALSO READ | ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్: పెళ్లి చేస్తే రూ.లక్ష.. పండక్కి బట్టలు కొనుక్కునేందుకు రూ.2500
ఈవీఎం వద్దు అంటూ చేసిన తీర్మానం పై కొలివాడ గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. డిసెంబర్ 2న గ్రామసభలో ఈ తీర్మానాన్ని చేశాం.. గ్రామస్తుల డిమాండ్ మేరకు మేమంతా ఓ నిర్ణయానికి వచ్చి భవిష్యత్తులో జరిగే ఎలక్షన్లలో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వాడాలని తీర్మానించామన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పృథ్విరాజ్ చౌహాన్ కు కొలివాడ గ్రామంలో ఒక్క ఓటు కూడా రాకపోవడంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.. అందుకే ఎన్నికల్లో బ్యాలెట్ వినియోగాన్ని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఇటీవల మహారాష్ట్రలోని షోలాపూర్ లోని మల్షఇరాస్ నియోజకవర్గంలో ఓ గ్రామ ప్రజలు కూడా ఈవీఎంల బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. మర్కద్వాడి అనే గ్రామంలో గ్రామస్తులంతా ఏకమైన EVM లు వద్దు, బ్యాలెట్ పేపర్లతో మాక్ రీపోలింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు.. ఈ సంఘటన కొద్ది రోజులకే కొలివాడ ప్రజలు EVM లు వద్దంటూ తీర్మానం చేశారు.