ముంబై: అప్పు తీర్చలేదని భర్త ముందే భార్యను రేప్ చేశాడో వడ్డీ వ్యాపారి. ఈ దారుణం మహారాష్ట్ర పుణే సిటీలో గత ఫిబ్రవరిలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హడప్సర్ కు చెందిన దంపతులు ఇంతియాజ్ షేక్(47) అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.40 వేలు అప్పు తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తిరిగి చెల్లించలేకపోయారు. దాంతో డబ్బులు ఇవ్వాల్సిందేనని షేక్ వేధించాడు. భర్తను కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా మళ్లీ వేధించాడు. ఆమె నిరాకరించడంతో ఫోన్‌లో వీడియో రికార్డ్ ఆన్ చేసి అత్యాచారం చేశాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చివరకు ఆ దంపతులు హడప్సర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. దాంతో షేక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇలాగే ఇంకెవరినైనా ట్రాప్ చేశాడా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
ALSO READ :జంట జలాశయాలకు భారీగా వరద నీరు.. హిమాయత్ సాగర్ 4గేట్లు ఎత్తివేత