భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఎస్పీ కల్యాణ్ఎలెసెలా కథనం ప్రకారం...జిల్లాలోని కోయలీబేడా పోలీస్‌స్టేషన్‌పరిధిలోని హురత్రాయి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారు. పక్కా సమాచారంతో రిజర్వ్ గార్డ్స్, బీఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్‌కు వెళ్లారు.
వీరి రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. జవాన్లు కూడా ఎదురుకాల్పులకు దిగారు. సుమారు రెండు గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరగ్గా మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. తర్వాత సంఘటనా స్థలంలో చూడగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. రెండు తుపాకులతో పాటు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వివరించారు.
ప్రెషర్ బాంబు పేలి సీఏఎఫ్ జవాను దుర్మరణం
భద్రాచలం : చత్తీస్గఢ్రాష్ట్రంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి ఆదివారం ఓ జవాను చనిపోయాడు. బీజాపూర్ఎస్పీ జితేంద్రయాదవ్ కథనం ప్రకారం...జిల్లాలోని మిర్తూర్పోలీస్స్టేషన్ పరిధిలోని బేఛాపాల్అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం సీఏఎఫ్( చత్తీస్‌గఢ్ ఆర్ముడ్ఫోర్స్) బలగాలు కూంబింగ్‌కు వెళ్లాయి. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై ఆశిష్యాదవ్అనే జవాన్కాలు మోపడంలో అది పేలింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. మిగిలిన జవాన్లను సురక్షితంగా అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చినట్లు ఎస్పీ జితేంద్రయాదవ్తెలిపారు.