దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటితో పోలిస్తే పలు రాష్ట్రాల్లో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గుతోంది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 40,805 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇది శనివారం నమోదైన కేసుల కన్నా 12శాతం తక్కువ. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా 44 మంది చనిపోయారు. ముంబైలోనూ కరోనా కేసులు తగ్గాయి. ఇవాళ కొత్తగా 2,550 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 2,93,305 యాక్టివ్ కేసులున్నాయి.
తమిళనాడులో ఈ రోజు 30,580కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 40 మంది చనిపోయారు. ప్రస్తుతం తమిళనాడులో 2,00,954 యాక్టివ్ కేసులున్నాయి.
గుజరాత్ లోనూ కేసుల సంఖ్య తగ్గింది. గత ఐదు రోజుల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో ఇవాళ 16,617 మంది కొవిడ్ బారిన పడగా..19 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,34,000గా ఉంది.
COVID19 | Maharashtra reports 40,805 new cases and 44 cases today; Active cases in the state rise to 2,93,305. pic.twitter.com/e31lKeg56C
— ANI (@ANI) January 23, 2022