తిరుమల ఘాట్ రోడ్ లో మహాశాంతి హోమం.. ఎందుకంటే..

తిరుమల ఘాట్ రోడ్ లో మహాశాంతి హోమం.. ఎందుకంటే..

తిరుమల ఘాట్ రోడ్డులో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో టీటీడీ ఘాట్ రోడ్డులో మహాశాంతి హోమం నిర్వహించింది. వెంకటేశ్వరస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం కోరుతూ ఏడో మైలు దగ్గర హోమం చేశారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సుల వల్లే రోడ్డు ప్రమాదాల్లో భక్తులకు పెద్ద గాయాలు కాలేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఈ హోమం ద్వారా ఎలాంటి ఆపదలు కలుగకుండా నివారణ చేయొచ్చు అన్నారు

తిరుమల ఘాట్ రోడ్డులో  ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు టీటీడీ మహాశాంతి హోమం జరిపించింది. అయితే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఎవరూ చనిపోలేదు కానీ.. వాహనాలు పాడైపోయాయి. అంతేకాకుండా భక్తులు గాయాలపాలయ్యారు. అయితే ఆ వెంకటేశ్వరస్వామి చల్లని చూపు వల్లనే భక్తులకు ఎలాంటి ఆపద జరగడం లేదని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. అయితే ఈ హోమం ద్వారా ఎలాంటి ప్రమాదాలు, ఆపదలు కలుగుకుండా నివారణ చేయొచ్చని.. అందుకే మహాశాంతి హోమం జరిపించినట్లు ఈవో తెలిపారు.

బుధవారం( జూన్ 14) డౌన్‌ ఘాట్‌ రోడ్డులోని ఏడో మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర మహా శాంతి హోమం జరిపారు. ఈ కార్యక్రమంలో ఈవో పాల్గొన్నారు. ఘాట్‌ రోడ్లలో వరుస ప్రమాదాల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో పాటుగా.. మరికొన్ని ప్రమాదాలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘటనల అనంతరం ఘాట్ రోడ్డు ప్రమాదాలను ఎలా అధిగమించాలనే అంశంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్టీసీ ఆర్ఎంలతో సమావేశం నిర్వహించినట్లు ఈవో చెప్పారు. అదే సమయంలో, భక్తుల భద్రత కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోరుతూ హోమం నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహాదారులు సూచించారన్నారు. అందుకోసమని ఘాట్ రోడ్లలో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు.. మహా శాంతి హోమం నిర్వహించిన్నట్లు ఈవో తెలిపారు.

  ఆపదలు, భయాందోళనలు, అంటువ్యాధులు మొదలైన అశుభాలు కలిగినప్పుడు మహాశాంతి హోమం నిర్వహించాలని ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు, తిరుమల ఆలయ ప్రధాన అర్చకులలో ఒక‌రైన శ్రీ వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఈ హోమం నిర్వహించడం ద్వారా ఎటువంటి ఆపదలు కలుగకుండా నివారణ చేయవచ్చని వారు వివరించారు.  విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ట, విశేష హోమాలతో మహా శాంతి హోమం ప్రారంభమై మహా పూర్ణాహుతితో ముగిసింది.