శంభో.. మహదేవ..హైదరాబాద్‌లోని ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలు 

శంభో.. మహదేవ..హైదరాబాద్‌లోని ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలు 

హైదరాబాద్​ సిటీ, నెట్​వర్క్ :  గ్రేటర్​ సిటీ శివ నామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల వద్ద రోజంతా క్యూలైన్లు కనిపించాయి. శివలింగాలకు అభిషేకం, ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు బారులుదీరారు. చాలాచోట్ల శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. మేడిబావి ఆర్యసమాజ్​లో నిర్వహించిన రుద్రయాగంలో 108 జంటలు పాల్గొన్నాయి.

భారీగా తరలి వచ్చిన భక్తజనంతో కీసరగుట్ట కిక్కిరిసింది. శ్రీభవానీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు. దర్శనానికి 5 గంటల సమయం పట్టింది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. ఎగ్జిట్​ గేట్ ​గుండా అధికారుల బంధువులను దర్శనానికి పంపించడంపై సాధారణ భక్తులు మండిపడ్డారు.