మహాశివరాత్రి జాతరకు పటిష్ట బందోబస్తు : ఎస్పీ అఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహాజన్​

మహాశివరాత్రి జాతరకు పటిష్ట బందోబస్తు : ఎస్పీ అఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహాజన్​

వేములవాడ, వెలుగు: ఈ నెల 25 నుంచి 27వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట  బందోబస్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నట్లు రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహాజన్​తెలిపారు. గురువారం రాజన్న ఆలయ పరిసరాలను పరిశీలించారు. పార్కింగ్ ప్రాంతాలు, ఆలయంలోకి వచ్చి వెళ్లే దారులు, క్యూ లైన్లు, ధర్మగుండం, కల్యాణకట్ట ప్రాంతాలను పరిపరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.

దూరప్రాంతాల నుంచి వచ్చే వారి వాహనాల పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రదేశాలు ఏర్పాటుచేయాలన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా డ్రైవర్షన్ల వద్ద సూచిక బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్పీ  వెంట ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మురళీకృష్ణ, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఈవో వినోద్, ఈఈ రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏఈవో శ్రవణ్ కుమార్ ఉన్నారు.