మూడు నదుల సంగమం.. త్రినేత్రుడు పార్వతీ, గంగా సమేతంగా వెలసిన పవిత్ర క్షేత్రం ‘తీర్థాల’, ఎక్కడైనా శివపార్వతుల కల్యాణం జరుగుతుంది. కానీ, ఇక్కడ పరమశివుడు గంగమ్మల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేస్తారు. ఈ ఆలయంలోని ఆరడుగుల పాలరాతి శివలింగం ఇక్కడి ప్రత్యేకత.
ఖమ్మం జిల్లాలోని తీర్థాలలో మున్నేరు, ఆకేరు, బుగ్గేరు నదులు కలుస్తాయి. ఆ సంగమం దగ్గరే సంగమేశ్వరుడు వెలిశాడు. ఈ ఆలయం వెనుక పెద్ద కథే ఉంది. త్రేతా యుగంలో పార్వతి, గంగా సమేత పరమేశ్వరుడు ప్రమదగణాలతో, సప్త రుషులతో కలిసి వెంకటేశ్వరుడి కల్యాణానికి వెళ్లారు. అక్కడనుంచి తిరిగి వెళ్తూ తీర్థాల దగ్గర ఆగారు. మూడు నదులు కలిసిన ఆ ప్రదేశాన్ని చూసి మురిసిపోయి అక్కడే ఉండిపోవాలనుకున్నారు. అయితే, స్వామి నిర్ణయం మేరకు అత్రి, భృగు, మౌద్గల్య మహర్షులు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించారు. ఆ మహర్షుల పేర్ల మీదుగానే ఈ నదులకు ఆకేరు, బుగ్గేరు, మున్నేరు అనే పేర్లు వచ్చాయి". అని భక్తులు చెప్పుకుంటారు. సంగమేశ్వరాలయంలో మహాశివరాత్రికి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.
తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం ఇది. ఇక్కడ ఆలయాన్ని ఎవరు కట్టించారనేది. ఐదురోజుల జాతర ఇప్పటికీ అంతుచిక్కని విషయమే. ఇది దట్టమైన ఏటా మహా శివరాత్రి సందర్భంగా అడవిలో చెట్లు, పుట్టల మధ్య చాలా కాలం. వరకు ఇక్కడ ఒక ఆలయం ఉందనే విషయం ఎవరికీ తెలియదు.
ఐదువందల ఏళ్ల క్రితం ఆయుర్వేద వైద్యుడు బజ్జూరి నాగయ్య మూలికల కోసం ఈ ప్రాంతంలో వెతుకుతుండగా ఆలయం కనిపించింది. తర్వాత నాగయ్య పాకయాజ్ఞులనే బ్రాహ్మణుడి సహాయంతో ఆలయాన్ని అభివృద్ధి చేశాడు. తర్వాత దీనికి 'తీర్ధాలు' అని పేరు పెట్టాడు. కొంతకాలానికి ఇక్కడ కొంతమంది ఇళ్లు కట్టుకున్నారు. దాంతో ఈ పేరు మీదుగానే తీర్థాల గ్రామం ఏర్పడింది. అప్పటి నుంచి సంగమేశ్వరుడు నిత్యం పూజలందుకుంటున్నాడు. తర్వాత కొంత కాలానికి ఈ ఆలయం పక్కనే మరో ఆలయాన్ని నిర్మించి అందులో అరడుగుల పాల రాతి శివలింగాన్ని ప్రతిష్టించారు. ప్రస్తుతం ఈ లింగానికే నిత్యపూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. ఆలయ పూజారి రాఘవవర్మ చుట్టు పక్కల గ్రామాల నుంచి విరాళాలను సేకరించి ఆలయానికి ప్రహరీ, ధ్వజస్తంభం, యాగశాల కట్టించారు. 1968లో ఈ ఆలయం దేవాదాయశాఖ ఆధీనంలోకి వెళ్ళింది. ఈ ఆలయానికి 80 ఎకరాలు, పక్కనే ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి 40 ఎకరాల మాన్యం ఉంది.
మూడు గర్భగుడులు
సంగమేశ్వరాలయంలో ప్రతేకత ఏంటంటే పక్కపక్కనే మూడు గర్భగుడులు ఉన్నాయి. అందులో రెండింటిలో శివలింగాలున్నాయి. మూడోది నరసింహాలయం.. కానీ ఈ ఆలయంలో ప్రస్తుతం విగ్రహం లేదు. గర్భగుడిపై మాత్రం మహా విష్ణువు రూపం ఇప్పటికీ కనిపిస్తుంటుంది. ఆలయ గోడలపై మత్స్యావతారాన్ని సూచించేలా ఉన్న ఒక చేపబొమ్మ, ఏనుగుల, గుర్రాల, ద్వారపాలకుల శిల్పాలు ఉన్నాయి..
ఐదురోజులపాటు జాతర
ఏటా మహా శివరాత్రి సందర్భంగా ఐదు లక్షలమంది వస్తుంటారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, కృష్ణా జిల్లాలతో పాటు చత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలి వస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలచరించి పరమశివుడిని దర్శించుకుంటారు. కానీ, కొన్నాళ్లుగా మూడు నదుల్లోనూ నీళ్లు ఉండకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
ALSO READ :- చాక్ పౌడర్, గంజితో ట్యాబ్లెట్లు తయారు : హైదరాబాద్లో ఊహించని మాఫియా
ఉత్సవాల సందర్భంలో మాత్రం ఎన్ఎస్పి కాల్వ నీటిని మున్నేరులోకి వదిలినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. అందుకే త్రివేణి సంగమం వద్ద చెక్ డ్యామ్ కట్టించి నీటిని నిల్వ చేయాలని భక్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
ఐదు వందల ఏళ్ల క్రితం..
ఖమ్మం నగరానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం.