
మహాశివరాత్రి.. శివభక్తులకు(శైవభక్తులకు) చాలా ప్రత్యేకమైనరోజు. ఈ రోజున శివాలయాలు భక్తులతో కిక్కిరిసోతాయి. సామాన్య జనం నుంచి సెలబ్రిటీల వరకు ఇష్టదైవాన్ని కొలుస్తారు. ఉపవాసాలు, జాగారం చేస్తుంటారు. చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు. తెల్లవార్లు జాగారం చేస్తుంటారు. వేకువ జామున స్నానమా చరించి శివపూజతో ఉపవాసం, జాగార దీక్ష విడుస్తారు. కొంతమంది రోజంతా ఉపవాసం ఉండే భక్తుల సాయంత్రం వేళ ఉపవాసం తర్వాత పాలు, పండ్లు తీసుకుం టారు.మరికొంతమంది ఏం తినాలో తెలియక ఏదీ పడితే అది తింటుంటారు. మరీ ఏం తినాలి.. ఏం తినకూడదో తెలుసుకుందాం.
Also Read :- శివరాత్రి,మహా శివరాత్రి మధ్య తేడా ఏంటీ
చాలా మంది కఠిన ఉపవాసం, జాగారం చేస్తుంటారు.. అలా చేయలేని వారు మధ్యలో ఏదైనా ఆహారం తీసుకోవచ్చుంటున్నారు. ఆలూ టిక్క , ఆలూ పకోడా లాంటివి బంగాళదుంపకు సంబంధించినవి తినొచ్చు. ఎక్కువ నీరసం రాకుండా ఉడికించిన కందగడ్డలు తినవచ్చు పాలు శివునికి ఇష్టమైనవి అని చెబుతారు. భక్తులు శివలింగంపై పాలు పోసి పూజలు చేస్తారు.. మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తులు పాలు తాగుతారు. ముఖ్యంగా ఉపవాస సమయంలో పాలు, పాలతో కూడిన పాని యాలు, బాదంపాలు, సేమియాలాంటివి తీసుకుంటుంటారు.
కఠిన ఉపవాసం పాటించలేని భక్తులు పండ్లు, పాలు, నీరు క్లలిపినవి తీసుకోవచ్చు. పండ్లతోపాటు ప్రూట్ సలాడ్స్, మిల్క్ ప్రూట్ షేక్స్, డ్రైప్రూట్స్, బాదం, వాల్ నట్ లు, ఖర్జూరం, పప్పులు, ఎండుద్రాక్ష వంటివి తినవచ్చు.