![Astrology : కుంభరాశిలో నాలుగు గ్రహాల సంయోగం.. ఐదు రాశుల వారికి అదృష్టం మాములుగా ఉండదు..](https://static.v6velugu.com/uploads/2025/02/mahasivaratri-day-is-wounderul-lucky-zodica-signs-details-here_OE3S4TJkYD.jpg)
మహాశివరాత్రి ఫిబ్రవరి 26 ఈరోజు ఎంత పవిత్రమైన రోజు వేరే చెప్పనక్కర లేదు. ఆ రోజున (2025 ఫిబ్రవరి 26) గ్రహాల కూటమిలో అద్భుతం జరగనుంది. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శని గ్రహాలు కుంభరాశిలో మార్చి 14 వరకు కలసిఉంటాయి. దీనివలన ఐదు రాశుల వారికి ( మేషం, వృషభం, కన్య, తుల, మకరం రాశుల ) వారికి చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఈ రాశులతో పాటు మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
మేషరాశి : కుంభరాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శని గ్రహాలు సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థిక అవసరాలు, సమస్యలు చాలావరకు తీరిపో తాయి. ముఖ్యమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన ముఖ్యమైన కోరికలు.. సమస్యలు పరిష్కారమవుతాయి. ఎంతో కాలంగ ఎదురు చేస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయపరంగా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది.ఉద్యోగంలో మీ సమర్థత, నైపుణ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలకు నష్టాలు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.
వృషభం:కుంభరాశఙలో నాలుగు గ్రహాలు కలిసి సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఊహించని పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు లభించడంతో పాటు పెద్ద ఎత్తున ధన లాభం కలగడానికి అవ కాశం ఉంది. సామాజికంగా కూడా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, గౌరవ మర్యాదలు పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతాయి. ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
మిథున రాశి: కుంభరాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శని గ్రహాలు కలవడం వలన మిథున రాశి వారు ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆగిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగస్తులు సహోద్యోగి సహాయం తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతాయి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించవద్దు. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్తగా పెట్టుబడులు పెట్టకండి. ప్రేమ.. పెళ్లి.. ఇతర ముఖ్యమైన పనులను కొద్దికాలం పాటు వాయిదా వేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కర్కాటక రాశి: కుంభరాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శని గ్రహాలు కలయిక వలన వీరు చేపట్టిన పనుల్లో మొదట ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినా తరువాత క్రమంగా పూర్తవుతాయి. కుటుంబంలో కొంత ఆందోళనకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు .. తోటి ఉద్యోగుల సహకారం పుష్కలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఇది అనుకూలమైన సమయం. ప్రేమ .. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోవాలని పండితులు చెబుతున్నారు.
సింహరాశి: ఈ రాశి వారు కుటుంబసభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. సంపాదన తగ్గడంతో చేతి ఖర్చులకు కూడ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది, అతికష్టంపై కొన్ని పనులు పూర్తవుతాయి. విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు... సహోద్యోగులతో వాదనలు పెట్టుకోవద్దు. ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కన్యారాశి: ఈ రాశికి కుంభరాశిలో నాలుగు గ్రహాలు సంచరించడం వలన పట్టిందల్లా బంగారం అవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వీరు తీసుకునే నిర్ణయాలు సంతృప్తికరంగా ఉండటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది.. ఖర్చులు కూడా పెరుగుతాయి. కొత్తగా స్థిరాస్థులు కొనే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఏ విషయంలోనూ ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయం. నిరుద్యో గులకు దూర మప్రాంతంలో మంచిమ ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధాలు చూసే వారికి వివాహం నిశ్చయమవుతుంది. ప్రేమ వ్యవహారాన్ని వాయిదా వేసుకోండి.
తులారాశి: ఈ రాశి వారు అనుకోకుండా ప్రయాణం చేయాల్సి రావచ్చు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇంట్లో గెస్ట్‌ల తాకిడి ఎక్కువ అవుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. ప్రేమ.. పెళ్లి విషయాలు కలసి వస్తాయి. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్.. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన విషయాల్లో సీక్రసీ మెయింటైన్ చేయండి. అవసరమున్నంత వరకు.. ఎవరితో ఏ విషయం చెప్పాలో.. మాట్లాడో.. అంతవరకే చెప్పండి... మాట్లాడండి. ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేని వారితో మీ విషయాలను షేర్ చేయవవద్దని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
వృశ్చిక రాశి: కుంభరాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శని కలయిక కారణంగా వృశ్చిక రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశి వారు .. తెలియకుండానే కొంత ఆందోళనకు గురవుతారు.పెట్టుబడుల వల్ల నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా తీసుకునే నిర్ణయాలపై చాలా జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో అనవసరమైన చర్చల్లో పాల్గొనవద్దు. ఉద్యోగస్తులు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆఫీసుల్లో గొడవలు పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి కుంభరాశిలో నాలుగు గ్రహాల సంయోగం వలన సమాజంలో గౌరవం.. కీర్తి పెరుగుతాయి. కుటుంబసభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది. తోబుట్టువులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. దీనితో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.
మకరరాశి: కుంభరాశిలో బుధుడు.. శని కలవడం వల్ల .. ఈ రాశి వారికి ఏర్పడే కొత్త పరిచయాలతో ప్రయోజం పొందుతారు.కొన్ని సమస్యలు పరిష్కారం కావడంతో మనశ్శాంతి ఏర్పడుతుంది. సమస్యలు, కొన్ని బాధ్యతల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. కొంతమంది సహోద్యోగుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి. అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్లండి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కుదురు తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది.
కుంభరాశి: ఈ రాశిలోనే సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శని కలయిక జరుగుతుంది. ఈ రాశి వారికి ఆదాయం.. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు. ఏ పని చేసిన కుంభ రాశి వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. అయితే ఆవేశాన్ని తగ్గించుకోండి. లేదంటే చాలా ఇబ్బందులు పడతారు. వ్యాపార రంగంలో ఉన్న వారుకొత్త పెట్టుబడులు పెడతారు. సేవింగ్స్ చేద్దామనుకున్నా ...ఈ కాలంలో పొదుపు చేయడం కష్టమవుతుంది. ప్రేమ .. పెళ్లి వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.
మీనరాశి: ఈ రాశి వారికి .. కుంభరాశిలో నాలుగు గ్రహాలు కలయిక వలన ఊహించని స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. వృత్తి.. వ్యాపారాలు బాగా కలసి వస్తాయి. ఆదాయ వృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి రెట్టింపు కావడం, వృత్తి, వ్యాపారాల్లో కూడా లాభాలు అంచనాలను మించడం జరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి సంక్రమిస్తుంది.
ALSO READ | Vastu Tips : కొండలపై ఇల్లు కట్టుకోవచ్చా..? కట్టుకుంటే వాస్తు పాటించాలా.. !