
హిందువులు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి మహా శివరాత్రి. ఆ పవిత్రమైన రోజున (ఫిబ్రవరి 26) భక్తులు ఆలయాలకు పోటెత్తుతారు. శివలింగానికి అభిషేకం చేస్తారు. పరమేశ్వరుని అనుగ్రహం, ఆశీర్వాదాల కోసం పూజలు చేస్తుంటారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం... జాగారం ముఖ్యమైనవి. చాలామంది ఉపవాస దీక్షను పాటిస్తారు. కాని చాలామంది తెలిసో తెలియక కొన్ని పనులు చేసిన వారికి ఈ జన్మలో పెళ్లి కాదని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .
ఉపవాస దీక్ష: మహాశివరాత్రి రోజు ఉపవాసం పాటించే ఆచారం.... ఎన్నో యుగాల సంప్రదాయం. ఉపవాసం ఉంటూ.. అబ్బ ఆకలవుతుంది.. ఈరోజు ఎప్పుడు గడుస్తుందా.. అని ఎదురు చూడకూడదు. లిమిట్ గా పాలు.. పండ్లు తీసుకుంటూ.. ఇతర ఆలోచనలు రాకుండా దైవ చింతనతో గడపాలి. ఓం నమ:శ్శివాయ అంటూ.. పంచాక్షరి మంత్రం జపిస్తూ.. తపస్సు చేసుకోవాలి. అసహనంగా.. కోపంగా ఉండకూడదు. బుద్ది పూర్వకంగా పరమేశ్వరునిపై చిత్తశుద్దిఉంచి భక్తితో ధ్యానం చేసుకోవాలి. ఎలాంటి చెడు ఆలోచనలు రానీయకూడదు. ఇలాకాకుండా ఒకపని చేస్తూ .. మరో పనిపై శ్రద్ద పెడితే.. ఇతగాడికి పెళ్లి జరిగితే భార్య విషయంలో కూడా అలానే ఆలోచించే అవకాశం ఉంది కదా.. అందుకే బ్రహ్మచారులుగానే మిగిలిపోతారు.
స్వామికి అభిషేకం: మహాశివరాత్రి రోజు నిర్వహించే ఆచారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. స్వామిని ఉదయాన్నే అభిషేకం చేసి.. ఆ జలాన్ని తీర్థంగా తీసుకోవాలి. పంచామృత అభిషేకాలను కూడా నిర్వహించాలి. చాలా మంది అభిషేకాలు చేస్తూ... ఆపశోపాలు పడతారు. పండితులు రుద్రం.. నమకం..చమకం.. చదువుతుంటే .. మీరు భక్తి..అంకితభావంతో ఓంనమ:శ్శివాయ అంటూ అభిషేకంచేయాలి. అభిషేక ద్రవ్యాలను ఒకేసారి గుమ్మరించకూడదు. ఉద్దరిణితో ( స్పూన్) కాని.... చిన్న గ్లాస్ తో కాని చుక్క..చుక్క కంటిన్యూగా స్వామి వారికి సమర్పించాలి. అభిషేకం చేసేటప్పుడు మనస్సు.. బుద్ది అంతా శివుడిపై ఉంచాలి. అభిషేకం అంటే శుద్ది అని అర్దం.. శుద్దిగా లేని వారితో ఎలా ఉంటారు.. అందుకే ఇలాంటి ఆచారాలు పాటించని వారి వివాహాలకు ఆటంకాలు ఏర్పడుతాయి.
Also Read:-తెలంగాణలో త్రికూట( త్రిమూర్తుల) ఆలయం..
ఆచారాలను గౌరవించాలి: చాలామంది శింగినాదం అంటూ ఆచారాలేమిటి అంటుంటారు. కాని హిందూ ధర్మంలో ప్రతి ఆచారానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. శివరాత్రి వరకు శీతల గాలులు వీస్తాయి.. శివరాత్రి తరువాత ఎండలు ముదురుతాయి..( ప్రస్తుతం ఎప్పుడు.. చలి పుడుతుందో... వర్షం పడుతుందో.. ఎండ కాస్తుందో తెలియదనుకోండి అది వేరే విషయం). సహజంగా ఎండాకాలం చాలా వేడిగా ఉంటుందని అందరికి తెలిసిందే. కాని శివరాత్రి రోజున భక్తితో అభిషేకం చేసిన పంచామృతాలను తీర్దంగా తీసుకుంటే శరీరంలో చల్లగా ఉండా ఉష్ణాన్ని నిరోధిస్తుందని పండితులు చెబుతుంటారు. అందుకే చాలా మంది మజ్జిగను తాగుతారు. మజ్జిగను కూడా పాల నుంచే కదా వచ్చేది. కొంతమంది ఇదంతా ఏమీ లేదని కొట్టిపారేస్తారు. అలాంటి వివాదాలకు .. తర్కాలకు.. చర్చలకు దూరంగా ఉండండి. స్వామి దగ్గర పూజ చేసేటప్పుడు తొందరపడవద్దు.. ఎందుకంటే ఉపవాసం ఉండాలి.. జాగారం చేయాలి .. ఆధ్యాత్మిక చింతనతో గడపాలి కదా.. అక్కడ లేనిపోని గందరగోళం సృష్టించడం వల్ల నిర్వాహకులకు.. భక్తులకు అసౌకర్యం కలుగుతుంది. అలాంటి వాటిని నిరోధించండి.
ప్రతి మంత్రానికి శక్తి ఉంటుంది : పురాణాల ప్రకారం.. శివుడి హాల హలం తీసుకున్న తరువాత.. మూర్చవచ్చిందని.. ఆతరువా పరమేశ్వరుడిని లేపేందుకు.. దేవతలు.. మునులు.. రుషులు కలిసి ఆయన కంఠంపై అభిషేకం చేస్తూ పవిత్ర మంత్రాలను చదివారు. ఆ జలాన్ని.. మంత్రశక్తితో ధారపోయడం వలన పరమేశ్వరుడికి స్పృహ వచ్చిందని చెబుతుంటారు. కాని ఈ రోజుల్లో పది నిమిషాలు దేవుడి దగ్గర కూర్చొని చిత్తశుద్దితో ప్రార్థించలేకపోతున్నాం. కాని ఏ మంత్రం జపించినా.. ఏ అనుష్ఠానం చేసిన తప్పకుండా మంత్రశక్తి ప్రభావం ఉంటుంది. అందుకే సంకల్పం చెబుతారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా.. అని కొందరు ప్రశ్నిస్తారు. కాని ఇలాంటి మంత్ర ప్రభావం వలనే కదా.. హాలం హలాన్ని శివుడు తీసుకొని కంఠం దగ్గర ఉంచుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించాలి.
దానధర్మాలను నిర్లక్ష్యం చేయడం: మహా శివరాత్రి వేడుకల్లో దానం లేదా దానధర్మాలు ఒక అంతర్భాగం, కరుణ, సానుభూతి నిస్వార్థత అనే విలువలు కలిగి ఉంటాయి. పేదలకు దానం చేయాలి. ఎవరు ఏ రూపంలో ఉంటారు తెలియదు కావు. మీ ఇంటికి వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపకండి. దేవాలయం దగ్గర ఉండే వారికి దానం చేయండి. అంతా మంచే శుభం చేకూరుతుంది. దానం చేయని చేతులకు తాళి కట్టే అర్హత ఉండదని పద్మపురాణంలో ఉంది.