శివయ్య అభిషేకం : చెరకురసంతో కష్టాలకు విముక్తి.. సువర్ణ జలంతో దరిద్రం పోతుందట..

శివయ్య అభిషేకం : చెరకురసంతో కష్టాలకు విముక్తి.. సువర్ణ జలంతో దరిద్రం పోతుందట..

ఎనలేని కష్టాలు.. చెప్పుకోలేనన్ని బాధలు... ఏ పూజ చేసినా  ఎలాంటి నోము నోచినా తీరకపోతే  మహాశివరాత్రి రోజున ( ఫిబ్రవరి 25)  చెరకు రసంతో అభిషేకం చేస్తే పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.  అలాగే సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దరిద్రాలు తొలగుతాయట. స్వామివారిని అనేక ద్రవ్యాలతో అభిషేకం చేయవచ్చని పండితులు చెబుతున్నారు.  ఒక్కో ద్రవ్యానితో అభిషేకం చేస్తే ఒక్కో ఫలితం వస్తుంది. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అయితే ఏ ద్రవ్యంతో చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. . .

మహాశివరాత్రి.. 2025 ఫిబ్రవరి 25 బుధవారం..  ఆ రోజు దాదాపు హిందువులందరూ.. పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు.  చాలా మంది కొబ్బరి నీళ్లు.. ఆవు పాలు .. పంచామృతాలతో అభిషేకం చేస్తారు.  అయితే స్వామివారిని అనేక ద్రవ్యాలతో అభిషేకం చేయవచ్చని పండితులు చెబుతున్నారు.  ఒక్కో ద్రవ్యానితో అభిషేకం చేస్తే ఒక్కో ఫలితం వస్తుంది. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. . . .

పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించడం వల్ల చెడు ఆలోచనలు తగ్గుతాయి. స్వార్థం అనే ఆలోచన రాకుండా చేస్తుంది. ఆనందం పొందుతారు.ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరు మీద రుద్ర పధంతో శివాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు. అభిషేకం వల్ల దీర్ఘకాలిక  రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అభిషేకం ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు, సంతానం వంటి ప్రయోజనాలు ప్రసాదిస్తుంది.

  • చెరకు రసం: దుఖం తొలగిపోతుంది.. కష్టాలు తీరుతాయి
  • సువర్ణ జలం: దరిద్రం తొలగిపోతుంది
  • ఆవుపాలు:  సర్వ సుఖాలు కలుగుతాయని నమ్మకం... దీర్ఘాయువు ఇస్తుంది
  • ఆవు పెరుగు: ఆరోగ్యం, బలం సమకూరతాయి... సంతాన ప్రాప్తి లభిస్తుంది
  • ఆవు నెయ్యి : ఐశ్వర్యం పెరుగుతుంది
  • కొబ్బరినీళ్లు:  సర్వ సంపద వృద్ధి చెందుతుంది
  • పసుపు, కుంకుమ: మంగళ ప్రదం
  • విభూది : కోటి రెట్ల ఫలితం దక్కుతుంది
  • పంచదార: శత్రువులు నశిస్తారు
  • తేనె:  తేజస్సు పెరుగుతుంది
  • బిల్వ జలం: ఆనందం వెల్లివిరుస్తుంది
  • భస్మ జలం : పాపాలు తొలగిపోతాయి
  • నువ్వుల నూనె:  మృత్యు దోషం తొలగిపోతుంది
  • రుద్రాక్షలు వేసిన నీరు: ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది
  • సుగంధోదకం:  పుత్ర సంతోషం కలుగుతుంది
  • పుష్పోదకం: స్థిరాస్తి పెరుగుతుంది
  • అన్నాభిషేకం:  సుఖ జీవనం
  • ద్రాక్ష రసం: సకల కార్యాభివృద్ధి
  • మామిడి పండు రసం: దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి.
  • ఖర్జూర రసం:  శత్రునాశనం
  • దూర్వోదకం( గరిక జలం): ఆర్థికాభివృద్ధి
  • గంగోదకం:  సర్వ సమృద్ధి, సంపద ప్రాప్తి లభిస్తుంది
  • కస్తూరీ జలం: రాజసం
  • నేరేడు పండ్ల రసం: నిరాశ తొలగిపోతుంది
  • నవరత్న జలం: గృహ ప్రాప్తి కలుగుతుంది

అభిషేకం లేకుండా శివారాధన పూర్తికాదని పండితులు చెబుతున్నారు. శివాభిషేక సమయంలో మహన్యాసం  తరువాత.. రుద్ర, పురుష సూక్తం, చమకం, మహా మృత్యుంజయ మంత్రం మొదలైనవి నిర్ధిష్ట లయ క్రమంలో జపిస్తారు. శివ భక్తులు ఆరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. అభిషేకం చేసే నీరు, ఇతర వస్తువులు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. 
 
మహాశివరాత్రి ...మాఘమాసం కృష్ణ పక్షం చతుర్థశి.. ఈ ఏడాది(2025)  మహాశివరాత్రి ఫిబ్రవరి 26న వచ్చింది. శివరాత్రి రోజు శివాలయాలు కిటకిటలాడిపోతాయి.  దాదాపు ప్రతి శివాలయంలో అభిషేకాలు నిర్వహిస్తారు. విష్ణుమూర్తి అలంకార ప్రియడైతే.. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఆ రోజున  2025 ఫిబ్రవరి 26న శివుడికి లింగోద్భవ సమయంలో అంటే అర్దరాత్రి 12 గంటల సమయంలో అభిషేకం చేస్తారు.