Maha Shivratri 2025 : శివరాత్రి వత్రం ఏంటీ.. ఎలా చేయాలి.. నియమాలు ఏంటీ తెలుసుకోండి..!

Maha Shivratri 2025 : శివరాత్రి వత్రం ఏంటీ.. ఎలా చేయాలి.. నియమాలు ఏంటీ తెలుసుకోండి..!

శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి ( 2025 ఫిబ్రవరి 26) . హిందువుల పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి. పార్వతీదేవిని శివుడు పెళ్లాడిన రోజునే ఈ పండుగగా జరుపుకుంటారు. అలాగే శివపురాణంలో మహాశివరాత్రికి సంబంధించి ఇంకొన్ని కథలు కూడా ఉన్నాయి.  శివరాత్రి వ్రతాన్ని ... ఎలా చేయాలి.. నియమాలు ఏమిటి  మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..!

శివరాత్రి అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది ఉపవాసం, జాగరణ. ఆ రోజున  (ఫిబ్రవరి 26) ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తే పుణ్యం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.  మాఘమాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రి వస్తుంది. ఈ రోజున శివుడిని భక్తి, పూజలతో కొలిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. దేశమంతటా శివాలయాల్లో పెద్ద ఎత్తున శివరాత్రి సంబరాలు జరుపుకుంటారు. 

ALSO READ | Maha Sivaratri 2025: శివరాత్రి రోజు (ఫిబ్రవరి 26) ఇలా చేయండి.. ఆర్థిక సమస్యలు తీరతాయి

శివరాత్రి వ్రతం.. ఎలా చేయాలి? 

శివరాత్రి నాడు తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి ఆ తర్వాత శివరాత్రి వ్రతాన్ని మొదలు పెట్టాలి. ఈ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం, జాగరణం, బ్రహ్మచర్యం అనే నియమాలు పాటించాలి. ఇంట్లోనే గానీ, ఆలయంలోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. రాత్రంతా జాగరణం ఉండి, ఉదయాన్నే స్నానం చేశాక మళ్లీ పూజ చేసి వ్రతాన్ని విడవాలి. 

ఇలా చేయండి 

  •  ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి. 
  •  గుడికి వెళ్లి దేవుడ్ని దర్శనం చేసుకోవాలి. 
  •  అన్నం లాంటి రోజూ తీసుకునే ప్రధాన ఆహారం కాకుండా పాలు, పండ్లు మాత్రమే, అదీ సాయంత్రం పూటనే తీసుకోవాలి. 
  •  ఇతరులతో దైవ సంబంధమైన మాటలనే ఎక్కువగా మాట్లాడితే మంచిది. 
  • ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. 
  •  అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండకండి.


–వెలుగు, లైఫ్​–