హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ లోని మహత్మాగాంధీ జ్యోతిబాయి పూలే గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తొమ్మిదో తరగతి స్టూడెంట్ జిల్లోజు శివాని(14) క్లాస్ రూంలో ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుంది. ‘తొమ్మిదో తరగతిలో ఏడుగురు బాలికల ప్రవర్తన సరిగా లేదు. పది రోజుల పాటు ఇంటికి తీసుకెళ్లాలని పేరెంట్స్కు సూచించాం.
కానీ తాము అందుబాటులో లేమని శివాని పేరెంట్స్ చెప్పారు. ఇదిలా ఉండగానే ఇవాళ తెల్లవారుజామున హాస్టల్ నుంచి కిందకు వచ్చిన శివాని.. క్లాస్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది’ అని ప్రిన్సిపాల్ అనిత వెల్లడించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు స్కూల్వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పేరెంట్స్ మందలిస్తారనే భయంతోనే శివాని సూసైడ్చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.