ఎంతకు తెగించార్రా.. గాంధీ తాత నోట్లో టపాసులు పెట్టి కాల్చడం ఏంట్రా..

ఎంతకు తెగించార్రా.. గాంధీ తాత నోట్లో టపాసులు పెట్టి కాల్చడం ఏంట్రా..

నేటి తరం యువతకు ఏది మంచి.. ఏది చెడు అన్నది బొత్తిగా తెలియడం లేదు. ఒకవేళ పెద్దొళ్లు నాలుగు మంచి మాటలు చెపుదామన్నా ఎవడూ ఆలకించడు. నీకే తెలుసులే.. నువ్వెంది మాకు చెప్పేది అన్నట్లుగా లుక్కులు ఇస్తారు. ఎంత ఎర్రి కాకపోతే, దేశ జాతిపిత మహాత్మ గాంధీ నోట్లో టపాసులు పెట్టి కాలుస్తారు చెప్పండి. ఈ ఘటన మరెక్కడో జరిగింది కాదు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోనే ఇది వెలుగు చూసింది.

దీపావళి పండగరోజు నగరమంతా కుటుంబసభ్యులతో కలిసి సరదాగా టపాసులు కాలిస్తే.. కొందరు ఆకాతాయులు మాత్రం వెర్రి చేష్టలతో బాణసంచా కాల్చారు. మహాత్మా గాంధీ విగ్రహం నోట్లో టపాసులు(లక్ష్మి బాంబులు) పెట్టి కాల్చారు. పైగా తామేదో దేశాన్ని ఉద్ధరించే పని చేసినట్లు, ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కంటోన్మెంట్‌లోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

వీడియో వైరల్ అవ్వడంతో విచారణ చేపట్టిన బోయిన్ పల్లి పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది మైనర్లు ఉండడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు శాంతి, అహింసకు ప్రతీక అయిన గాంధీ వారసత్వాన్ని అవమానించడమేనని ప్రజలు వాపోతున్నారు. పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.