మహాత్మా గాంధీజీ పుట్టింది మనదేశంలోనే అయినా ఆయన్ని కోట్ల మందికి ప్రతినిధిగా మారేలా చేసింది మాత్రం దక్షిణాఫ్రికాలో గడిపిన జీవితమే. రైలు ప్రయాణంలో ఫస్ట్ క్లాస్ కేటగిరీ టికెట్ ఉన్నప్పటికీ బ్రిటీషోళ్లు బలవంతంగా రైలు నుంచి దించేయడంతో ఆయన పోరాటం మొదలైంది.
ఆ తర్వాత అక్కడ బానిసలుగా బతుకుతున్న లక్షలాది భారతీయుల సమస్యలు, ఇబ్బందుల్లో అండగా నిలిచారు గాంధీజీ. ఆ టైంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగినట్లు చెప్తారు. అదేంటంటే.. దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయుల్లో తెలుగువాళ్లు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్లు.
Also Read :- మహాత్మా గాంధీ మెచ్చిన నాయకులు వీళ్లే
వాళ్లతో మాట్లాడడంలో గాంధీజీకి భాషతో సమస్య వచ్చింది. దాంతో తెలుగు నేర్చుకోవాలనుకున్నారట గాంధీజీ. కానీ, కుదరకపోవడంతో చివరికి ఆయనే తెలుగువాళ్లను హిందీ నేర్చుకోమన్నారట.