
భారత జాతిపిత మహాత్మా గాంధీ కుటుంబంలో విషాదం నెలకొంది. మహాత్మా గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పారిఖ్ (93) మృతి చెందారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో గుజరాత్‌లోని నవ్‌సరిలో మంగళవారం (ఏప్రిల్ 1) ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నీలంబెన్ అంత్యక్రియలు బుధవారం (ఏప్రిల్ 2) వీర్వాల్ శ్మశానవాటికలో జరుగుతాయని తెలిపారు. నీలంబెన్ పారిఖ్ మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ | పార్లమెంటులో వక్ఫ్ బిల్లుపై చర్చ..యూపీలో భద్రత పెంపు..పోలీసులకు సెలవులు రద్దు
కాగా, నీలంబెన్ పారిఖ్ మహాత్మా గాంధీ కుమారుడు హరిదాస్ గాంధీ మనవరాలు. ప్రస్తుతం ఆమె తన కుమారుడు డాక్టర్ సమీర్ పారిఖ్‌తో కలిసి ప్రస్తుతం నవ్‌సరి జిల్లాలో నివసిస్తున్నారు. నీలాంబెన్ చిన్నప్పటి నుంచే తన ముత్తాత గాంధీని ఫాలో అయ్యింది. గాంధేయ భావజాలాన్ని ఆమె అమితంగా విశ్వసించింది. తన జీవితాన్ని గాంధేయ ఆదర్శాలకు, సంక్షేమానికి అంకితం చేసింది. అలాగే.. మహిళా సంక్షేమం, మానవ సంక్షేమానికి తీవ్రంగా కృషి చేసింది.