
మహాత్ముడికి అవమానం..సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
మాస్కో: రష్యాలో మహాత్మాగాంధీకి అవమానం జరిగింది. మహాత్ముడి పేరు, ఫొటోతో బీర్ టిన్నులను విక్రయిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. రష్యాకు చెందిన రివార్ట్ కంపెనీ బీర్ క్యాన్‌లపై గాంధీ ఫొటోతో పాటు మహాత్మ జీ అని రాసి ఉంది. అలాగే, గాంధీ సంతకాన్ని కూడా బీర్ క్యాన్లపై ముద్రించారు.
ఒడిశా మాజీ సీఎం నందిని సత్పతి మనవడు సుపర్ణో సత్పతి బీర్ క్యాన్‌లపై గాంధీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే, ఈ ఘటనపై రష్యాతో చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘‘ఇది చాలా అభ్యంతరకరం. గాంధీజీకి మద్యానికి ఉన్న సంబంధం ఏంటి? ఆయన ఆల్కహాలిక్ కాదు.
ఆయన వ్యక్తిత్వానికి సరిపోయే ఇతర ఉత్పత్తులపై ఆయన పేరును, ఫొటోను వాడండి. అంతేకాని ఇలాంటి చేష్టలతో అవమానించకండి” అంటూ ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.