- మహాయుతికి మ్యాజిక్ ఫిగర్
- 125 స్థానాల్లో కమలం విజయం
- మ్యాజిక్ ఫిగర్ స్థానాలు 145
- శివసేన షిండే వర్గానికి 56
- అజిత్ పవార్ ఎన్సీపీకి 37
- దేవేంద్ర ఫడ్నవిస్ కే చాన్స్ అంటున్న బీజేపీ నేతలు
- మోదీ డిసైడ్ చేస్తారంటున్న సీఎం షిండే
- నేను రేసులో ఉన్నానంటున్న అజిత్ పవార్
- సమిష్టిగానే ఉంటే సేఫ్ అంటున్న ఫడ్నవీస్
హైదరాబాద్/ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. బీజేపీ అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా అవతరించబోతోంది. మొత్తం 145 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కాగా బీజేపీ 125 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన (షిండే) పార్టీకి 56 స్థానాల్లో విజయం సాధించింది. అదే కూటమిలోని మరో పార్టీ ఎన్సీపీ (అజిత్ పవార్) 38 సీట్లు సాధించింది. అయితే మూడు పార్టీలు కలిసి విజయం సాధించినందున ఏ పార్టీకి సీఎం పదవి దక్కుతుందనే చర్చ మొదలైంది.
దీనిపై ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే స్పందించారు. సీఎం ఎవరనేది ప్రధాని మోదీ, హోం మంత్ర అమిత్ షా కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇదిలా ఉండగా మరో వైపు అజిత్ పవార్ కూడా సీఎం ఎవరనే అంశంపై స్పందించారు. తానూ ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్టు తెలిపారు. అందరం సమిష్టిగా ఉంటేనే సేఫ్ గా ఉంటామని దేవేంద్ర ఫడ్నవిస్ కామెంట్ చేశారు. ఇదిలా ఉండగా మరో వైపు బీజేపీ నేతలు మాత్రం దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు.
అదే జరగాలంటే బీజేపీకి వచ్చిన సీట్లు అధికార పగ్గాలు చేపట్టేందుకు సరిపోవు. మొత్తం మ్యాజిక్ ఫిగర్ కోసం మరో 20 సీట్లు బీజేపీకి అవసరం అవుతాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అధికారం దక్కుతుందా..? ఇప్పటి వరకు సీఎంగా ఉన్న ఏక్ నాథ్ షిండేకు మరో మారు అవకాశం ఇస్తారా..? ఇద్దరినీ కాదని అజిత్ పవార్ కు అధికారం కట్టబెడతారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.