మాగనూర్,వెలుగు: రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో పాదయాత్ర కు సంబంధించిన తెలంగాణ రూట్ మ్యాప్ ను గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిశీలించారు. వాసు నగర్ చెక్ పోస్ట్ నుంచి బార్డర్ కృష్ణా వరకు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్తలు, అభిమానులు ఆయన స్వాగతం పలికారు. సీనియర్ నాయకులు మల్లు రవి, చిన్నారెడ్డి,ఒబెదుల కొత్వాల్,శ్రీహరి,ఆనంద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ : రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర ఈనెల 24న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మక్తల్ లో నిర్వహించే సమీక్షా సమావేశానికి వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మిడ్జిల్ మండల కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఎంపీటీసీ గౌస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి, సంపత్ కుమార్, రామ్ గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.
ఆల్ ఇండియా అండర్-19 క్రికెట్ టోర్నీకి విశాల్గౌడ్ ఎంపిక
మహబూబ్నగర్, వెలుగు : ఒరిస్సా లో శుక్రవారం నుంచి జరుగనున్న ఆల్ ఇండియా అండర్-19 క్రికెట్ టోర్నీలో తెలంగాణ టీమ్ లో ఆడేందుకు మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామానికి చెందిన విశాల్ గౌడ్ సెలెక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం అతన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, మహబూబ్నగర్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి
అలంపూర్, వెలుగు: హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు హఠాత్తుగా చనిపోయాడు. ఉండవెల్లిఎస్ఐ బాలరాజు వివరాల ప్రకారం.. హైదారాబాద్ డిపో1 కు చెందిన బస్సు కర్నూల్ మీదుగా ఆదోని వెళ్తోంది. ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామానికి చెందిన రమేశ్ జడ్చర్ల దగ్గర బస్సు ఎక్కి, కర్నూల్ టికెట్ తీసుకున్నాడు. బస్సు జల్లాపూర్ చెక్ పోస్ట్ దాటగానే
టికెట్ కు మిగిలిన చిల్లర అడిగేందుకు డ్రైవర్ వద్దకు చేరుకున్నాడు. చిల్లర అడుగుతూనే ప్రక్కనే ఉన్న సీటుపై కుప్పకూలాడు. గమనించిన డ్రైవర్ అలంపూర్ చౌరస్తాలో బస్సును నిలిపి, పోలీసులకు సమాచారం అందించారు. రమేశ్ ను అలంపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిశీలించిన డాక్టర్లు .. రమేశ్ మృతి చెందాడని తెలపాడు.
నేడు ఉచిత మెగా రక్తదాన శిబిరం
గండీడ్, వెలుగు : టీఆర్ఆర్ జనరల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగిలో మాజీ ఎమ్మెల్యే, ట్రీమ్స్ చైర్మన్ టి. రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుందని, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని చెప్పారు. ప్రజలు ఈ మెగా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా
గద్వాల టౌన్, వెలుగు: ఆర్యవైశ్యుల అభివృద్ధికి టీఆర్ఎస్ కృషి చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్యుల కమ్యూనిటీ బిల్డింగ్ కు గురువారం ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామన్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాము, నరహరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.