మిడ్జిల్, వెలుగు: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలకు 150 రోజులు పని కల్పిస్తామని, రోజు కూలీ రూ.400 చేస్తామని మహబూబ్ నగర్ ఎంపీ క్యాండిడేట్ వంశీచంద్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. గురువారం కుర్వ గడ్డపల్లి మీనాంబరం శివాలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు.
మండలంలోని బైరంపల్లి, కంచన్ పల్లి, దోనూరు, సింగం దొడ్డి, పస్పుల, వల్లభరావు పల్లి, రాణి పేట, కొత్తపల్లి గ్రామాల్లో ప్రచారం చేయగా, పార్టీ శ్రేణులు డప్పులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిడ్జిల్ మండలం నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు. మండలంలో మెజార్టీ ఇస్తే సీఎం దగ్గర కొట్లాడి మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని తెలిపారు. జడ్చర్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ దీపా గోపాల్ రెడ్డి, ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బెక్కరి రాజశేఖర్ రెడ్డి తదితరులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అల్వాల్ రెడ్డి, గౌస్, నర్సింహా, రాజారెడ్డి, బాద్మి శివకుమార్, కృష్ణ, శివ, మల్లికార్జున్ రెడ్డి, సాయిలు, ఉస్మాన్, శంకర్, రాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.