![బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ 34 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండు: ఎమ్మెల్యే మురళి నాయక్](https://static.v6velugu.com/uploads/2025/02/mahbubabad-mla-murali-naik-said-that-former-brs-mla-shankar-naik-has-grabbed-34-acres-of-government-land_Qo4gFqR0ZN.jpg)
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ తీవ్ర ఆరోపణలు చేశారు. శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. మెడికల్ కాలేజ్ పక్కన సర్వే నెంబర్ లో 287,551 లో 34 ఎకరాలు ప్రభుత్వ భూమిని శంకర్ నాయక్ కబ్జా చేశాడని ఆరోపించారు. శంకర్ నాయక్ కబ్జా చేసిన సెంట్ భూమిని కూడ వదలకుండా స్వాధీనం చేసుకుంటామన్నారు.
Also Read :- బీజేపీకి నా అవసరం లేదనుకుంటా
మహబూబాబాద్ పట్టణ శివారలోని అనంతారం పరిధిలో శంకర్ నాయక్ కబ్జా చేసిన సేవాలాల్ స్థలం ప్రతి గిరిజన బిడ్డాకు హక్కు ఉంటుందని చెప్పారు ఎమ్మెల్యే మురళీ నాయక్. సేవాలాల్ ట్రస్ట్ నీది కాదు గిరిజన బిడ్డలదని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో శంకర్ నాయక్ నీ గ్రామాల్లో తిరగకూండా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఆర్టీ కల్చర్ కళాశాలపై బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచించారు. త్వరలోనే మాల్యాల గ్రామంలో ఆర్టీ కల్చర్ కళాశాలకు శంకుస్థాపన చేస్తానని చెప్పారు మురళి నాయక్.