కొత్తగూడ,వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అన్నారు. శనివారం కొత్తగూడ,గంగారం మండల కేంద్రాల్లో సీఆర్పిఎఫ్,సివిల్ పోలీసులతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు.
అనంతరం మావోయిస్టుల ఆచూకీ తెలిపితే రివార్డులు ఉంటాయని, వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. మావోల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. వారి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం తిరుమల గండిలో యువకులతో క్రికెట్ ఆడి ఉత్తేజాన్ని నింపారు.ఆయన వెంట డీఎస్పీ తిరుపతిరావు,గూడూరు సీఐ బాబురావు, కొత్తగూడ, గంగారం ఎస్పైలు దీలీప్, రవికుమార్ ఉన్నారు.