గండీడ్, వెలుగు: ఫారెస్ట్ ల్యాండ్‌ను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ ఎఫ్ఆర్ఓ మగ్దూం హుస్సేన్ హెచ్చరించారు. గాదిరాల్ 70 సర్వే నంబర్ పరిధిలో అక్రమంగా చెట్లు నరికిన ప్రదేశాన్ని సోమవారం మహమ్మదాబాద్ ఫారెస్ట్ రేంజ్ బీట్ఆఫీసర్లతో కలిసి మగ్దూం హుస్సేన్ పరిశీలించారు. అదే టైంలో ఓ వ్యక్తి కొంత మందితో కలిసి అక్కడికి వచ్చాడు.
‘‘చెట్లు కొట్టింది మేమే.. ఏం చేస్తారో చేస్కోండి.. మాకు పట్టా ఉంది’’ అంటూ అధికారులతో గొడవకు దిగాడు. జాయింట్సర్వే తర్వాత పట్టా ఉన్న భూమిలో ఏమైనా చేసుకోండి.. అటవీ శాఖ పరిధిలోని భూమి జోలికొస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని ఎఫ్ఆర్ఓ హెచ్చరించారు. జిల్లా ఫారెస్ట్ స్పెషల్ పార్టీ అధికారులు మధ్యాహ్నం తర్వాత మరోసారి విచారణ చేపట్టారు. పూర్తి నివేదికను త్వరలోనే అందజేస్తామని ఎఫ్ఆర్ఓ తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు.