ఎరువులు బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు : జి.రవినాయక్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : జిల్లాలో ఎరువులను బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు తప్పవని  కలెక్టర్  జి.రవినాయక్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్​ షాప్​ను తనిఖీ చేశారు. ఎరువులు, స్టాక్  రిజిస్టర్, స్టాక్ ను పరిశీలించారు. యూరియా, డీఏపీ, ఎంవోపీ, కాంప్లెక్స్  ఎరువులు ఎన్ని బస్తాలు వచ్చాయనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎరువులు ఏ ప్రాతిపదికన ఇస్తారని ప్రశ్నించారు.  గో డౌన్ లో నిల్వ ఉన్న ఎరువులను సైతం ఆయన లెక్కించారు. యూరియా, పొటాష్  ఎరువులు ఈ పాస్ లో నమోదు చేసి అమ్మాలని, ఎరువుల నిల్వల్లో తేడా వస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఎరువులు, పురుగు మందులను అమ్మాలని తెలిపారు. డీఏవో వెంకటేశ్, అగ్రికల్చర్​ ఆఫీసర్​ శ్యాం ఉన్నారు.

మార్పులు, చేర్పేలు కంప్లీట్ చేయాలి..

కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, సవరణలపై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్  ఆదేశించారు. మహబూబ్ నగర్, జడ్చర్, దేవరకద్ర నియోజకవర్గాల అధికారులతో ఓటరు జాబితా సవరణ, తదితర అంశాలపై టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. జడ్చర్ల ఈఆర్వో, అడిషనల్  కలెక్టర్  మోహన్ రావు, దేవరకద్ర ఈఆర్వో స్పెషల్  కలెక్టర్  నటరాజ్, మహబూబ్ నగర్  ఈఆర్వో, ఆర్డీవో అనిల్ కుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు.