- మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్ర సంపాదనను దోచుకొని విధ్వంసం సృష్టించిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 14 నెలల్లోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
పర్యటనలో భాగంగా సీఎం రూ. 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకోవడంతో దేశం ఆశ్చర్యపోయిందన్నారు. 2018 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ తెచ్చింది కేవలం రూ.25,750 కోట్లేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 14 నెలల్లోనే రూ.2,19,182 కోట్ల పెట్టుబడులు తెచ్చిందని గుర్తు చేశారు. 90 శాతం గ్రామాల్లో గ్రామ సభలు విజయవంతం అయ్యాయని, కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ లీడర్లు రాజకీయాన్ని భ్రష్టుపట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి. నాయకులు సీజే బెనహర్, సిరాజ్ ఖాద్రీ పాల్గొన్నారు.