సమయాన్ని వృథా చేసుకోవద్దు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

సమయాన్ని వృథా చేసుకోవద్దు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు : ఎస్సెస్సీ ఎగ్జామ్స్​కు 40 రోజుల సమయం మాత్రమే ఉందని, విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి పెట్టి ఉత్తమ ఫలితాలు సాధించాలని మహబూబ్​నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సోమవారం పలు ప్రైవేట్  స్కూళ్లలో  టెన్త్​ స్టూడెంట్లకు డిజిటల్  కంటెంట్  స్టడీ మెటీరియల్ ను అందజేశారు. విద్య, క్రీడలు, ఉద్యోగాలు, ఉద్యోగ కల్పనలో పాలమూరును ముందుంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 

హెచ్ఎం చిన్నికృష్ణ, అకడమిక్  ఇన్​చార్జి చంద్రశేఖర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్  లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, షబ్బీర్ అహ్మద్, ఖాజా పాషా, మోతీలాల్, పాపారాయుడు పాల్గొన్నారు.

ఆలయాన్నిఅభివృద్ధి చేస్తాం

మహబూబ్ నగర్ రూరల్ : ముడా నిధులతో ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని దివిటిపల్లి డబుల్  బెడ్రూమ్​ కాలనీలో  జరిగిన జిట్టా ఆంజనేయస్వామి, నవగ్రహ, ధ్వజ స్థంభం, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. శివప్రసాద్ రెడ్డి, సురేందర్ రెడ్డి, చర్ల  శ్రీనివాసులు, చంద్రశేఖర్, మురళి ముడా చైర్మన్  లక్ష్మణ్ యాదవ్  పాల్గొన్నారు.