మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్ నియోజకవర్గం లగచర్లకు వెళ్తున్న ఎంపీ డీకే అరుణను మొయినాబాద్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం డీకే అరుణను అరెస్టు చేసి మొయినాబాద్ పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా డీకే అరుణ .. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేవారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ చేతకాని దద్దమ్మ.. పాలనచేతకాక, తనను అడ్డుకుంటున్నారని విమర్శించారు. సొంత నియోజకవర్గం లో లా & ఆర్డర్ కంట్రోల్ చేయలేని అసమర్దుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.
ALSO READ | లగచర్ల కలెక్టర్‌పై దాడి ఘటనలో డీఎస్పీపై బదిలీ వేటు
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా చచ్చిపోయిందా అంటూ పోలీసులపై మండిపడ్డారు డీకే అరుణ. వెళ్లి సీఎం రేవంత్ ను అరెస్టు చేసుకోండని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే అరుణ. ప్రజలను కలవడానికి వెళ్తున్న తమను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ ను మించిన నియంతలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.