మాజీ మంత్రికి మతిభ్రమించింది : మున్సిపల్​ చైర్మన్​ ఆనంద్​ గౌడ్​

మాజీ మంత్రికి మతిభ్రమించింది : మున్సిపల్​ చైర్మన్​ ఆనంద్​ గౌడ్​
  • పాలమూరు మున్సిపల్​ చైర్మన్​ ఆనంద్​ గౌడ్​

పాలమూరు, వెలుగు : మాజీ మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మహబూబ్​నగర్​ మున్సిపల్​ చైర్మన్​ ఆనంద్​ గౌడ్​ ఫైర్​ అయ్యారు. ఆయన తమ్ముడు వి.శ్రీకాంత్​ గౌడ్​ అరెస్ట్​ను జీర్ణించుకోలేక ఆగం​అవుతున్నారని.. ప్రజా ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ ఆఫీసులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్నారు.

శ్రీనివాస్​గౌడ్  తన హయాంలో ప్రజలపై కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ఆయన వెంట ఉన్న వారంతా ఆయన బాధితులేనని తెలిపారు. సర్వే నంబర్​ 523లో ఏ4 గా శ్రీకాంత్ గౌడ్​పై కేసు నమోదైందని పోలీసులు నిర్ధారించిన వెంటనే, తమ్ముడిని దొంగచాటుగా హైదరాబాద్​లో సీక్రెట్​ ప్లేస్​లో దాచి ఉంచారన్నారు. ఆ లొకేషన్​ను పోలీసులు గుర్తించారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన తన తమ్ముడిని పోలీస్ స్టేషన్​లో అప్పజెప్పాడని గుర్తు చేశారు. ఇప్పుడు తమ్ముడి అరెస్ట్​ను జీర్ణించుకోలేక పాలమూరులో అనవసరంగా హంగామా చేస్తున్నాడని ఫైర్​ అయ్యారు.

మహబూబ్​నగర్​ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ చైర్మన్​ లక్ష్మణ్​ యాదవ్​ మాట్లాడుతూ పాలమూరులో బీసీలపై కేసులు పెట్టించింది శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై, ఎమ్మెల్యేపై సోషల్  మీడియాలో అనుచిత పోస్టులు పెడితే సహించమన్నారు. గ్రంథాలయ చైర్మన్​ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్​ ఖాద్రి, కౌన్సిలర్  నర్సింలు, లీడర్లు తిరుమల వెంకటేశ్, ఫయాజ్, నాగరాజు పాల్గొన్నారు.