ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌తో మాట్లాడుతాం

ముంబై: బ్యాటింగ్‌ లైనప్‌లో మార్పులు అనివార్యమైతే తప్పకుండా చేస్తామని ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌ మహేలా జయవర్ధనే అన్నాడు. ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌తో కూడా మాట్లాడతామన్నాడు. ‘బ్యాటింగ్‌ లైనప్‌ వైఫల్యంపై మేం చాలా ఆందోళనతో ఉన్నాం. మిగతా కోచ్‌లతో కలిసి దీనిపై ఓ ప్రణాళిక రూపొందిస్తాం. మంచి పిచ్‌లపై కూడా రాణించలేకపోతున్నారు. టీమ్‌లోని సీనియర్లకు  ఇలాంటి పరిస్థితులపై అవగాహన ఉంది. టీమ్‌ గెలవడానికి ఎలాంటి మార్పులు చేసేందుకైనా మేం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు కొన్ని చేసినా అవి ఫలితాన్ని ఇవ్వలేదు. బ్యాటింగ్‌లో  స్థిరంగా రాణించడమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. మొదట బ్యాటింగ్​ అయినా, ఛేజింగైనా మా బ్యాటర్లు తడబడటం ఆందోళన కలిగిస్తున్నది’ అని జయవర్ధనే పేర్కొన్నాడు. ఇప్పటివరకు స్వేచ్ఛగా ఆడేందుకు ఇషాన్‌కు అవకాశాలు ఇచ్చామని, ఇక నుంచి ప్రతి అంశంపై చర్చిస్తామన్నాడు.