అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్

అవిశ్వాస  తీర్మానంలో ఓడిపోయిన బండ్లగూడ  మేయర్ మహేందర్ గౌడ్

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మేయర్ మహేందర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో మేయర్ మహేందర్ రెడ్డి తన పదవిని కోల్పోయారు. కొర్పొరేషన్ లో మొత్తం 22 మంది సభ్యులున్నారు. వీరిలో 16 మంది అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. రాజేంద్ర నగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటింగ్ జరిగింది. 

మేయర్ తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు ఈ సమావేశానికి రాలేదు. ఇప్పటికే మేయర్ మహేందర్ గౌడ్ తన కార్పొరేటర్లు అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతన మేయర్ గా లతా ప్రేమ్ గౌడ్ ను ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు.

ALSO READ :- వీరు హోలీ ఆడారంటే ఇబ్బందులే... ఈ తప్పులు అసలు చెయొద్దు...