కాంగ్రెస్​ను ప్రజలు నమ్మరు: మహేందర్ రెడ్డి

కాంగ్రెస్​ను ప్రజలు నమ్మరు: మహేందర్ రెడ్డి

కోస్గి, వెలుగు: కాంగ్రెస్  పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువని, అలాంటి పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కోస్గిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మూడోసారి సీఎంగా కేసీఆర్  బాధ్యతలు స్వీకరిస్తారని, కొడంగల్ లో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసిన బీఆర్ఎస్  పార్టీకే ఓట్లు అడిగే హక్కు ఉందనన్నారు.

50 ఏండ్లుగా కొడంగల్ నియోజకవర్గంలో చేయని అభివృద్ధిని ఐదేండ్లలో చేసి చూపించారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ఇస్తున్నారని, ఇలాంటి హామీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. అభివృద్ధి, సంక్షేమం పార్టీకి అండగా ఉంటాయని చెప్పారు. మున్సిపల్  చైర్ పర్సన్  శిరీష రాజేశ్, హనుమంత్ రెడ్డి, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.