ఐపీఎల్‌‌ సీజన్‌‌ కు ధోనీ రెడీ

ఐపీఎల్‌‌  సీజన్‌‌ కు ధోనీ రెడీ

చెన్నై: ఇండియా లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్‌‌ ధోనీ ఐపీఎల్‌‌ 15వ సీజన్‌‌ కోసం రెడీ అవుతున్నాడు. వచ్చే నెల చివర్లో మొదలయ్యే మెగా లీగ్‌‌లో  చైన్నై సూపర్‌‌ కింగ్స్‌‌ను నడిపించనున్న మహీ నెట్‌‌ ప్రాక్టీస్‌‌ షురూ చేశాడు. పోయినేడాది అక్టోబర్‌‌ 15న జరిగిన గత సీజన్‌‌ ఫైనల్లో గెలిపించి చెన్నైకి నాలుగోసారి ట్రోఫీ అందించిన తర్వాత ధోనీ ఆటకు దూరంగా ఉన్నాడు.  ఈ వారం చివర్లో జరిగే ప్లేయర్​ ఆక్షన్​లో ఎలా ముందుకెళ్లాలనే విషయంలో  సీఎస్‌‌కే ఫ్రాంచైజీకి సూచనలు ఇచ్చిన మహీ  అదే టైమ్‌‌లో  రాబోయే సీజన్‌‌లో  సత్తా చాటేందుకు   తనను తాను ప్రిపేర్‌‌ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే  సోమవారం నెట్‌‌ సెషన్‌‌కు వచ్చి చాలాసేపు బ్యాటింగ్‌‌ ప్రాక్టీస్‌‌ చేశాడు.