ఓ లేడీ మహేంద్రా థార్ కారు నడుపుకుంటూ రోడ్డుపక్కనే ఉన్న ఎలక్ట్రికల్ పోల్ ఎక్కించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ నడుపుతున్న కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో థార్ వాహనం అదుపుతప్పింది. రోడ్డు పక్కగా ఉన్న ఎలక్ట్రిక్ పోల్ పైకి దూసుకెళ్లింది. అందులో ఉన్న అంచల్ గుప్తా క్షేమంగా బయటపడింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది.
Also Read:-ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటే ముగ్గురు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
గోల్డ్ కోర్స్ రోడ్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో హోండా అమేజ్ కారు ఎదురుగా వస్తున్న థార్ ని ఢీకొట్టింది. దీంతో థార్ ఎస్‌యూవీ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న కరెంట్ పోల్ పైకి అది దూసుకెళ్లింది. ఎలక్ట్రికల్ పోల్ పైకి థార్ వాహనం ఎక్కడం చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. అటుగా వెళ్తున్న కొందరు యువకుడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెటిజన్లు సంభ్తం ఎక్కిన థార్ కారు వీడియోపై బాగా రియాక్ట్ అవుతున్నారు.
Also Read:BSNLలో బీభత్సమైన ఆఫర్.. రూ.108కే ఇంత డేటానా.. మిగతా కంపెనీలు..?
"Now Thar people are giving Newton a run for his apple, challenging his gravity law and asking, 'What goes up must come down, really?'" 😅🤦🏼♂️ pic.twitter.com/fqmtmIPzL3
— Rattan Dhillon (@ShivrattanDhil1) July 8, 2024