మోడీ చేతుల్లో దేశం సురక్షితం..కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం సురక్షితంగా ఉందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్  పాండే చెప్పారు. సోమవారం రూరల్​ మండలం కోడూరు గ్రామంలో మండల అధ్యక్షుడు రాజు గౌడ్, ఎంపీటీసీ ఆధ్వర్యంలో కేంద్ర పథకాల లబ్ధిదారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం పని చేస్తున్న సైనికులకు అధునాతన ఆయుధాలు ఇచ్చి అండగా నిలిచారన్నారు. కాంగ్రెస్  పాలనలో కశ్మీర్  ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులు జరిగేవని ఆవేదన వ్యక్తం చేశారు.లేఖలు రాసి సరిపెట్టుకునే వారని ఎద్దేవా చేశారు.  ప్రస్తుతం ఉగ్రదాడులు చేసేందుకు భయపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. 

ALSOREAD:ఎర్లీ ఖరీఫ్ సారు ఇలాఖాకేనా?

ప్రపంచ దేశాల్లో ప్రధాని ఎక్కడికి వెళ్లినా ఘనంగా స్వాగతం పలుకుతున్నారన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. కేంద్రం అందంచే ప్రతీ రూపాయి లబ్ధిదారుడికి చేరుతుందని చెప్పారు. మోడీకి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. మాజీ మంత్రి పి. చంద్రశేఖర్, సీనియర్ నాయకులు గురుజు రాజేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడకుల బాలరాజు, ఎన్పీ వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, కృష్ణ వర్ధన్ రెడ్డి, పి శ్రీనివాస్ రెడ్డి, పాండురంగారెడ్డి, జయశ్రీ ,రాజుగౌడ్, శశిధర్ రెడ్డి, కోసిగి సతీశ్ కుమార్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.