
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ దుబాయ్ సందడి చేస్తోంది. ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి మెరిశారు. వీరితోపాటు మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా కని పించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దేవరతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తారక్ ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు. ఈ సినిమా త్వరలో నే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కించే ఓ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది.ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ లేకపోయినప్పటికీ ఇతర నటీనటులతో కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారు. అయితే మార్చి నుంచి ఎన్టీఆర్ సెట్‌లో జాయిన్ అవనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్పెషల్ సెట్‌ను రెడీ చేస్తున్నారు.
పీరియాడిక్ జానర్‌లో రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడు.. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ రూపొందించనున్న ఈ మూవీ సైతం రెండు భాగాలుగా వస్తుందనే టాక్ వినిపిస్తోంది.