
టాలీవడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రముఖ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఎస్ఎస్ఎమ్బి29 (వర్కింగ్ టైటిల్) సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో జక్కన్న పలు యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే రెండు రోజులుగా మహేష్-రాజమౌళి సినిమాకి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో SSMB29 సినిమా సెట్స్ నుంచి లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్ నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపించాడు. అలాగే మరో నటుడు కార్ పై కూర్చుని ఉండగా ఓ పోలీస్ క్యారెక్టర్ మహేష్ ని కొడుతున్నట్లు కనిపించాడు. అయితే మహేష్ గతంలో ఎప్పడూ లేని విధంగా లాంగ్ హెయిర్ లుక్ లో పవర్ఫుల్ గా కనిపించాడు. దీంతో కొందరు ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.
ALSO READ | సికందర్ మూవీ రీమేక్ కాదు.. ఒరిజినల్ స్టోరీ : మురుగదాస్
ఈ విషయం ఇల ఉండగా గతంలో ఎప్పుడూ లేని విధంగా డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. మంచి పవర్ఫుల్ స్టోరీ కావడంతో నిర్మాతలు కూడా బడ్జెట్ పెట్టాడనికి వెనుకాడటం లేదు. అయితే రాజమౌళి కూడా ఈ సినిమాతో తెలుగు సినిమాల్ని హాలీవుడ్ కి పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే భారీ బడ్జెట్ సినిమా కావడంతో రెండు పార్ట్స్ గ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.