Manjula, Mahesh Babu: అక్క మంజులతో మహేష్ ఫన్ మూమెంట్.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీతో కావాల్సినంత టైం స్పెండ్ చేస్తారు. టైం దొరికినప్పుడల్లా విదేశాలకు వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు. మహేష్ బాబు వెళ్ళినన్న వెకేషన్స్ మరే స్టార్ హీరో కూడా వెళ్లరు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఫ్యామిలీ అంటే మహేష్ కు అంత ఇష్టం. తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో గడిపిన క్యూట్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల మహేష్ బాబు తన కూతురు సితారతో కలిసి హైదరాబాద్ లో జరిగిన ఓ పెళ్లివేడుకకు హాజరయ్యారు. అదే వేడుకకు మహేష్ బాబు అక్క మంజుల కూడా హాజరయ్యారు. అక్కాతమ్ముళ్ల ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకొన్నారు. అలా ఆ పెళ్లి వేడుకలో మహేష్, మంజుల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read:సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోకిరి..పండుగాడి వెనుకున్న ఆసక్తికర విశేషాలు

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ తో సహా.. నార్మల్ ఆడియన్స్ కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాబట్టి.. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ పై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.