HBD Sitara: 'హ్యాపీ బర్త్ డే మై సన్ షైన్'..సితారకు మహేష్ బాబు స్పెషల్ విషెస్

HBD Sitara: 'హ్యాపీ బర్త్ డే మై సన్ షైన్'..సితారకు మహేష్ బాబు స్పెషల్ విషెస్

ఇప్పుడిప్పుడే యాక్టింగ్ రంగంలోకి అడుగుపెడుతోన్న ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara) ఘట్టమనేని నేటితో (జూలై 20) 11వ వసంతంలోకి అడగుపెట్టింది. ఈ సందర్భంగా తండ్రి మహేష్ బాబు, తల్లి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

"హ్యాపీ 12 మై సన్ షైన్ " అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మహేష్ బాబు. అలాగే నమ్రత తన ఇంస్టాగ్రామ్ నుంచి "నాతో ప్రయాణం చేసే నా స్వీట్ హార్ట్ కి జన్మదిన శుభాకాంక్షలు..ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తుంటాను..హ్యాపీ 12 మై లిటిల్ వన్" అంటూ విషెస్ తెలిపింది. 

సోషల్ మీడియాలో క్యూట్ పిక్స్, వీడియోస్ తో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకుంది సితార. యాక్టింగ్, సింగింగ్, పెయింటింగ్, డ్యాన్సింగ్ తో ఇప్పటికే తన టాలెంట్ ను నిరూపించుకుంది. చిన్న వయసులోనే మల్టీటాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్న సితార.. తాజాగా ఆమె తన 12వ పుట్టినరోజు వేడుక కావడంతో సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ విషెష్ చెబుతున్నారు. 

ఇక సితార విషయానికి వస్తే.. ఇప్పటికే ఆమె తన డాన్స్ వీడియోస్ తో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తండ్రి మహేష్ బాబుతో కలిసి పలు టీవీ షోలకు కూడా అటెండ్ అయ్యారు. సితార ప్రస్తుతం ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పిఎంజె జివెల్స్(Pmj jewellers) కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ సంస్థ సితార కలెక్షన్ పేరుతో ప్రత్యేకంగా ఓ స్పెషల్ బ్రాండ్ ను కూడా క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన యాడ్ ను న్యూ యార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం.