
టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్ గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli). టాలీవుడ్ లో కలల రాజకుమారుడిగా..మోస్ట్ స్టైలిష్ హీరోగా మహేష్ బాబు (Mahesh Babu) తనదైన మూవీస్ తో ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తోందని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి..ఫ్యాన్స్ అప్డేట్స్ విషయంలో ఆగలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో తరుచూ ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా ఈ హై-వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే ప్లాన్లో ఉన్నాడట డైరెక్టర్ రాజమౌళి. ఈ యాక్షన్ అడ్వెంచర్ జానర్‌లో సీక్వెల్స్ వస్తాయని కూడా చెబుతున్నారు. అంటే, ‘ఇండియానా జోన్స్’ మాదిరిగా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయనే న్యూస్ వినిపిస్తోంది.
ఆల్రెడీ , హీరో మహేశ్ కు రాజమౌళి ముందుగానే చెప్పేసాడని, అందుకు గాను మహేశ్ 5 సంవత్సరాలు డేట్స్ కూడా ఇచ్చేసాడని టాక్ నడుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. దాదాపు మహేష్తో వేరే డైరెక్టర్ సినిమా చేయాలంటే లేదన్న ఓ 6 నుంచి 7 ఏళ్ల టైం పట్టె ఛాన్స్ ఉందని సినీ వర్గాల సమాచారం.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదని గుర్తించుకోవాలి.
ఇకపోతే.. ఈ సినిమా కోసం మహేష్ తన మేకోవర్ను చాలా స్టైలిష్గా మార్చుకున్నాడు. ప్రస్తుతం లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్న మహేష్.. మీసాలు పెంచి, గడ్డంతో ఫిట్‌గా ఉన్నాడు. ఇప్పటికే మహేష్ కి సంబంధించిన కొత్త లుక్ ఫొటోస్ వైరల్ అవ్వగా ఆడియాన్స్ను తెగ ఆకట్టుకున్నాయి. మరోవైపు ఈ మూవీ షూట్ జనవరి నుంచి స్టార్ట్ కానుందని రచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల చెప్పారు. ఈ కథ రాయడానికి దాదాపు రెండేళ్లు టైమ్ పట్టిందన్నారు.
భారీ అంచనాలతో వస్తోన్న ఈ మూవీని నిర్మాత కె.ఎల్. నారాయణ రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే హాలీవుడ్ టెక్నీషియన్స్ను ఇందులో భాగం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Superstar #MaheshBabu's globe trotting adventure film #SSMB29 directed by SS Rajamouli will be made in two parts. pic.twitter.com/T7wAs8G0Qi
— Manobala Vijayabalan (@ManobalaV) October 17, 2024