ప్రస్తుతం ఇండియా నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైపుడ్ మూవీ ఏదైనా ఉందంటే అది మహేష్ బాబు (Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న మూవీ (SSMB29) అని చెప్పాలి.
అయితే ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు స్పెషల్గా SSMB29 నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఎదురుచూసారు. కానీ, ఎలాంటి అప్డేట్ రాకపోయేసరికి పూర్తిగా డిస్సపాయింట్ అయ్యారు. ప్రస్తుతానికి ఈ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ మాత్రం బయటికి వచ్చింది.
తాజాగా డైరెక్టర్ రాజమౌళి టీమ్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..అక్టోబరు 10న రాజమౌళి బర్త్డే స్పెషల్ గా SSRMB29 నుండి అప్డేట్ రానున్నట్లు టాక్.ఈ నెల సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి యూనిట్ సభ్యులు అందరు వర్క్ షాప్ లో పాల్గొంటారని టాక్. డిసెంబరు నుండి పక్కాగా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఫస్ట్ షెడ్యూల్ ను విదేశాల్లో మొదలెట్టనున్నారు. ఫారిన్ లోని అడవులలో భారీ చేజింగ్ సిక్వెన్స్ ను షూట్ చేయనున్నారు.
భారీ అంచనాలతో వస్తోన్న ఈ మూవీని నిర్మాత కె.ఎల్. నారాయణ రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను ఇందులో భాగం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ALSO READ | NTR, Mokshagna: సినిమా ప్రపంచం లోకి స్వాగతం..తమ్ముడికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విషెస్
టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్ గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి. అలాగే ప్రతి ఒక్కరి కలల రాజకుమారుడిగా గుర్తింపు పొందారు మహేష్ బాబు. దీంతో వీరిద్దరి ప్రాజెక్ట్ పై చిన్న న్యూస్ తెలిసిన చాలు..అది మాకు ఎంతో సంతోషం అంటూ సినీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
హై-వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా..కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు.