SSMB29 Updates: పాస్ పోర్ట్ లాక్కొని సింహాన్ని బోనులో బంధించిన జక్కన్న.. మహేష్ లాక్ అయినట్లేనా..?

SSMB29 Updates: పాస్ పోర్ట్ లాక్కొని సింహాన్ని బోనులో బంధించిన జక్కన్న.. మహేష్ లాక్ అయినట్లేనా..?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు జక్కన్న రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB29 సినిమా మొదలు కాకముందే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టోరీ నేరెషెన్, స్క్రిప్ట్ పనులు పూర్తయినప్పటికీ ఇంకా పట్టాలెక్కకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అసలే రాజమౌళి సినిమా అంటే టైమ్ టేకింగ్ ఎక్కువగా ఉంటుంది.. దీనికితోడు జక్కన్నతో పనిచేసే ఆర్టిస్టులకి ఇంకో సినిమాలో పని చేసే టైమ్ ఇవ్వడు. దీంతో జక్కన్న సినిమాతో అంటే దాదాపుగా 3 లేదా 4 ఏళ్ళు లాక్ అవ్వాల్సిందే.

అయితే మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు రాజమౌళి. ఇందులో భాగంగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాస్ పోర్ట్ ని చూపిస్తూ సింహాన్ని బోనులో బంధించినట్లు తెలిపాడు. అయితే సినిమా షూటింగులు లేనప్పుడు సందు దొరికితే విదేశాలకు వెళ్లిపోతుంటాడు మహేష్. దీంతో పాస్ పోర్ట్ ని రాజమౌళి తీసుకుని బ్రేక్ లేకుండా ఫాస్ట్ గా షూటింగ్ చెయ్యాలని సింబాలిక్ గా చెప్పాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఏదైతేనేం సినిమా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే అదే హ్యాపీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Also Read : మా అకౌంట్స్ చూసి ఐటీ అధికారులే షాకయ్యారు

మరోవైపు మహేష్ కూడా పోకిరి సినిమాలోని "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను" అనే డైలాగ్ ని కామెంట్ చేశాడు. ఇక ఈ సినిమాలో మహేష్ కి జోడీగా నటిస్తున్న ప్రియాంక చోప్రా కూడా హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. దీంతో రాజమౌళి పోస్ట్ కి "న్యూ చాప్టర్" అంటూ కామెంట్ చేసింది. మొత్తానికి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుండటంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.

ఈ విషయం ఇలా ఉండగా రాజమౌళి ఈ మధ్య ఎక్కువగా నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్ పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్, బాహుబలి, తదితర సినిమాలతో తెలుగు సినిమాలని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక మహేష్ SSMB29 సినిమాతో హాలీవుడ్ లో పాగా వెయ్యాలని చేస్తున్నాడు. దీంతో హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. బడ్జెట్ కూడా దాదాపుగా రూ.1200 కోట్లు పైగా ఉన్నట్లు సమాచారం.