మహేష్ - రాజమౌళి SSMB 29 మూవీ రెండు భాగాలుగా రూపొందబోతున్నట్లు సమాచారం. 2025 జనవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నారు జక్కన్న. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ మూవీ కోసం పర్ఫెక్ట్ ప్లాన్ వేస్తున్నాడట రాజమౌళి. అందుకు తగ్గట్లుగా నటి నటులను ఎంపిక చేస్తున్నాడట.
ఇక ఈ సినిమాను గ్రాండ్గా తీసుకురావడం కోసం వరల్డ్ ఫేమస్ టెక్నీషియన్స్ని రంగంలోకి దింపుతున్నాడు జక్కన్న.ఇప్పటికే ఆఫ్రికా అడవుల్లో లొకేషన్స్ని జల్లెడ పట్టొచ్చాడు. ఎంతో రియాలిస్టిక్గా ఉండేలా లోకేషన్స్ సెట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయి ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా గ్రాఫిక్స్ ఉండాలని హాలీవుడ్ సంస్థలతో చర్చలు కూడా జరిపారట రాజమౌళి.
దాదాపు రెండు సంవత్సరాల పాటు మహేష్..రాజమౌళి షూటింగ్ సెట్ లోనే గడిపే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున..రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
హై-వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా..కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు.