మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. SSMB28 అప్డేట్ వచ్చేసింది

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో మహేష్ చేస్తున్న మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా రివీల్ చేయనున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మహేష్ చేతిలో సిగరెట్ పట్టుకొని మాస్ అండ్  పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. 

పోస్టర్ ని క్లియర్ గా గమనిస్తే.. అందులో మహేష్ చుట్టూ ఎర్ర మిరపకాయలు కూడా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా ఎర్ర మిరపకాయలు కనిపిస్తుండటంతో ఈ సినిమాకి గుంటూరు కారం టైటిల్ నే ఫిక్స్ చేసారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అసలు టైటిల్ ఏంటా అనేది తెలియాలంటే మే 31 వరకు ఆగాల్సిందే. 

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయననుందో చూడాలి.