సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy)కి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. కాస్త ఆలస్యంగా స్పందించిన మహేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి అనుముల గారికి నా శుభాకాంక్షలు. మీ పాలనలో రాష్ట్రం మరింత పురోగతి సాధించాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, అభివృద్ధి, సంక్షేమంలో ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను.. అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మహేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Congratulations to @revanth_anumula garu on assuming office as the new CM of Telangana! May you lead the state to new heights of success, prosperity and development.
— Mahesh Babu (@urstrulyMahesh) December 8, 2023
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్ 7 తెలంగాణా రాష్ట్ర రెండో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.