అది నా బ్లడ్ లోనే ఉంది.. మహేష్ కూతురు ఎమోషనల్ పోస్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) కూతురు సితార(Sitara) ఎమోషనల్ పోస్ట్ చేశారు. అక్టోబర్ 13 జాతీయ సినిమా దినోత్సవం(National cinema day) సందర్బంగా తన  ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. సినిమా ఇండస్ట్రీపై ఆమె చేసిన ఈ పోటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

నీ జీవితంలో సినిమా అనే పదానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నా దృష్టిలో సినిమా అంటే కేవలం ఒక పరిశ్రమ కాదు.. అది ఆ  డీఎన్‌ఏలోనే ఉంది. లెజండరీ, ఎవర్‌గ్రీన్‌ సూపర్‌స్టార్‌ కృష్ణగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మా తాతగారు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఆయన వారసత్వంలో భాగమైనందుకు ఎంతోగానో గర్వపడుతున్నా. నాన్న ఎలాగైతే తాతయ్యను స్ఫూర్తిగా తీసుకున్నారో.. నేను కూడా అలాగే మా నాన్నని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతాను.. అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు సితార.

ఓ పోస్ట్ చూసిన నెటిజన్స్ సితారపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వయసులో చిన్నపిల్ల అయినా ఆలోచనలు మాత్రం చాలా గొప్పగా ఉన్నాయి. ఎంతైనా సూపర్ స్టార్స్ వంశం నుండి వచ్చింది కదా.. ఆ లక్షణాలు ఎక్కడికి పోతాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.